![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -95 లో..... ప్రేమ ధీరజ్ లు కళ్యాణ్ కోసం వెళ్తారు. అప్పుడే ధీరజ్ కి సాగర్ ఫోన్ చేసి చందుకి పెళ్లి సంబంధం ఒకే అయిందని చెప్పగానే.. ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలాంటి సిచువేషన్ లో కూడా నేను మా వాళ్ళతో లేను.. కారణం నువ్వే అంటు ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. ధీరజ్, ప్రేమ ఇద్దరు కళ్యాణ్ ఉన్న ఇంటికి వస్తారు. ఇల్లు కాళీ చేసి పది నిమషాలు అవుతుందని ఆ ఇంట్లో ఉన్నతను చెప్పగానే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు.
రామరాజు కుటుంబం మొత్తం హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడే భద్రవతి వాళ్ళు పిలిచి రేయ్ రామరాజు ఏం ఎంజాయ్ చెయ్యాలన్న ఈ రోజే.. రేపు పోలీసులు తీసుకొని వెళ్తారు కదా అంటూ అనగానే.. మీకెప్పుడు మమ్మల్ని బాధపెట్టాలనే ఉంటుందని వేదవతి వాళ్ళపై కోప్పడుతుంది. ఆ తర్వాత రామరాజు తెల్లారితే స్టేషన్ కి వెళ్ళాలని బాధపడుతంటాడు నర్మద భోజనానికి పిలుస్తుంది. నాకు తినాలని లేదని రామారాజు అంటాడు. ఇంకా ప్రేమ, ధీరజ్ లు ఇంటికి రాలేదని రామరాజు కోప్పడతాడు.
అప్పుడే భాగ్యం ఫోన్ చేసి రేపు మంచి రోజు అంట ముహూర్తం పెట్టుకోవడానికి ఇంటికి వస్తామని అనగానే రేపు వద్దని రామరాజు అంటడు. రేపు మంచి రోజు వస్తామంటూ భాగ్యం ఫోన్ కట్ చేస్తుంది. రేపు వాళ్ళు వస్తారంట.. రేపు స్టేషన్ కి తీసుకొని వెళ్తారని రామరాజు బాధపడతాడు. మరుసటి రోజు రామరాజు ఇంటికి పోలీసులు వచ్చి మీరు నగలు తీసుకొని వస్తానన్నారు.. మీ గడువు అయిపోయింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటారు. అప్పుడే ప్రేమ, ధీరజ్ లు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |